బలగం టివి,సిరిసిల్ల:
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సిరిసిల్లలోని శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు శనివారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుండి రూ. 16 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో సిరిసిల్ల లోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని మొదటి అంతస్తు లో ఎఫ్ -16 లో శనివారం ఉదయం 11.00 గంటలకు హాజరుకావాలని అన్నారు. మరిన్ని వివరాలకు 99121 78932, 99633 57250, 99853 46768 నంబర్ లలో సంప్రదించాలని కోరారు.