పోలింగ్ బూత్‌లో ఎస్.ఐ. మానవత్వం.. వృద్ధురాలి ఓటు హక్కు వినియోగానికి చేయూత..!

0
134

పోలింగ్‍ కేంద్ర ఆవరణలో వృద్ధులకు, దివ్యాంగులకు బాసటగా నిలుస్తున్న పోలీసులు

సహయంగా నిలిచిన పోలీసులు.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృద్ధులు..

బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట:

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడనికి వచ్చిన వృద్ధురాలి సహాయకంగా నిలిచిన ఎస్.ఐ. వెంకట్రాజం.

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, వెంకటాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలికి ఎస్.ఐ. (సబ్-ఇన్‌స్పెక్టర్) సహాయకంగా నిలిచి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.

వృద్ధాప్యం కారణంగా నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆ వృద్ధురాలు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంలో కాస్త తడబడ్డారు. దీనిని గమనించిన పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ. వెంటనే ఆమె వద్దకు వెళ్లి, ఆసరాగా చేయి అందించి, పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లారు. ఓటు వేసే వరకు వృద్ధులకు అండగా ఉండి, ఓటు హక్కు వినియోగించుకునేలా చూశారు.

ఓటు హక్కు వినియోగించుకోవడంలో పౌరులకు సహాయపడటం తమ విధిగా భావించిన పోలీసుల చర్యను స్థానికులు మరియు పోలింగ్ సిబ్బంది అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here