- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
మొత్తం 154 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు పంపారు. ముందుగా గత ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ, పంచాయతీ రాజ్ శాఖా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు.

