ఓటు హక్కు వినియోగించుకున్న 100 ఏళ్ల వృద్ధురాలిని అభినందించిన ఎస్పీ..

0
54

ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన ఎస్పీ మహేష్ బి. గితే

బలగం టీవీ, ఇల్లంతాకుంట:

ఇల్లంతాకుంట మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎస్పీ దృష్టికి, సరిగ్గా 100 సంవత్సరాలు నిండిన లక్ష్మీ అనే వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆప్యాయంగా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆమెకున్న విశ్వాసానికి, వంద ఏళ్ల వయసులో కూడా ఆమె చూపిన స్ఫూర్తికి ఎస్పీ అభినందనలు తెలిపారు. లక్ష్మీతో ముచ్చటించి, ఆమె ఆరోగ్య వివరాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే జిల్లా ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుత వాతావరణంలో ఎటువంటి భయాందోళనలు లేకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని ఎస్పీ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here