బలగం టీవి: రాజన్న సిరిసిల్ల

- విద్యార్థుల పట్ల కేర్ తీసుకోండి… ఒక్క విద్యార్థి కూడా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం వడ్డించాలి.
-ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
- ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన
సిరిసిల్ల ప్రభుత్వ బాలికల బిసి వసతి గృహా HWO కళ్యాణి పై సస్పెన్షన్ వేటు
కలెక్టరేట్ 18, జనవరి 2024:
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలలో
పరిశుభ్రత తో పాటు వాటిలో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల కు క్వాలిటీ విద్య అందేలా చూడడంతో పాటు భద్రతఫై ప్రత్యేక దృష్టి సారించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
గురుకులాల ప్రిన్సిపాల్ లు, వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల జిల్లాకేంద్రం గీతా నగర్ లోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ ను జిల్లా కలెక్టర్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలసి గురువారం
ఆకస్మికoగా తనిఖీ చేశారు.
హాస్టల్ లోని వంట గదులు, వాష్ రూం లలో పరిశుభ్రత ను పరిశీలించారు. స్టోర్ రూం ను , స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్లిజర్ సౌకర్యం ఉందా? మినరల్ వాటర్ అందుబాటులో ఉందా?
దుప్పట్లు, యూనిఫాం ల పంపిణీ చేశారా? మెను ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా ?
అంటూ ప్రశ్నించారు.
హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
హాస్టల్ కు కొత్తగా పేయింట్ వేయించాలని స్పెషల్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్ రఫీని ఆదేశించారు. ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు, మ్యాట్ ,ఇతర మౌలిక సదుపాయాల కల్పన కు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపాలని చెప్పారు.
ప్రస్తుతం హాస్టల్ లో 55 మంది విద్యార్థినీ ఉన్నందున వీరి సంఖ్యను 100 కి పెంచడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
అక్కడి నుంచి నేరుగా అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని బాలికల హాస్టల్ ను సందర్శిoచారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వేములవాడలోని మైనార్టీ గురుకుల బాలుర, పాఠశాల, కళాశాల ను పరిశీలించారు.
తరగతి, వంట, వసతి గదులు, ఆహార సరుకులను పరిశీలించారు. సరుకుల సరఫరాలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు
ఇక్కడే ఒకే బోరు బావి మీద మూడు పాఠశాలలు ఆధారపడి ఉన్నందున మరో బోరుబావిని మంజూరు చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ కనెక్షన్ కూడా ఇవ్వాలన్నారు.
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లేకపోవడం వల్ల ఓవర్లోడ్ తో
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రిన్సిపల్ రాజేష్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.మెస్ పాడవడం వల్ల విద్యార్థులు దోమకాటు కు గురవుతున్నారని చెప్పారు. ప్రైవేట్ బిల్డింగ్ లో గురుకులం నిర్వహిస్తున్న దృష్ట్యా భవన యజమాని తో మాట్లాడి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేలా చూడాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి గంగయ్య కు సూచించారు. దోమల బెడద లేకుండా మెస్ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మినరల్ వాటర్ ప్లాంట్ ను వారం రోజుల్లోగా పునరుద్ధరించాలని చెప్పారు. వాష్ రూం లకు డోర్ లను వెంటనే బిగించాలని సూచించారు.
పదో తరగతి విద్యార్ధుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని ప్రిన్సిపాల్ రాజేశంను ఆదేశించారు.
అక్కడి నుంచి నేరుగా వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ ను సందర్శించారు.
హాస్టల్ ను ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నామని చాలా నెలల నుంచి అద్దె డబ్బులు రావడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి తీసుకువచ్చారు. ఇక్కడ ఉండే విద్యార్థులు jntu, డిప్లొమా కోర్సులు చదువుతున్నారని హాస్టల్ సమీపంలో ఆర్టీసీ బస్సులు అపడం లేదన్నారు. ఈ హాస్టల్ లో 80 మంది విద్యార్థులు ఉంటున్నారని , సరిపడా బెడ్ లు లేక కొద్ది మంది విద్యార్థులు క్రింద పడుకుంటున్నారనీ చెప్పారు. సాధ్యమైనంత త్వరలో 15 కొత్త బెడ్ లను హాస్టల్ కు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
అక్కడి నుంచి వేములవాడ పట్టణంలోని బిసి బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్ లో పడక గదులు, వంట గది , వాష్ రూం లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
విద్యార్థుల పట్ల కేర్ తీసుకోండి… ఒక్క విద్యార్థి కూడా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ హాస్టల్ నిర్వాహకులు , ప్రిన్సిపల్ లకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం వడ్డించాలన్నారు.
వసతి గృహా అధికారినీ పై వేటు
కలెక్టర్ సిరిసిల్ల ప్రభుత్వ బాలికల బిసి వసతి గృహాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (HWO) కళ్యాణి విధుల్లో లేకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన
సిరిసిల్ల ప్రభుత్వ బాలికల బిసి వసతి గృహా HWO కళ్యాణి నీ సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె స్థానంలో మరో మహిళా అధికారినికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
కలెక్టర్ వెంట జిల్లా ఇన్ ఛార్జ్ మైనార్టీ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, స్పెషల్ అధికారి సర్వర్ మియా, ప్రత్యేక అధికారులు జిల్లా పశు సంవర్ధక శాఖా అధికారి కొమురయ్య, రఫీ
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.
