బలగం టీవి, తంగళ్లపల్లి :
- కలెక్టర్ అనురాగ్ జయంతి
- బద్దెనపల్లి లోని అంగన్వాడీ కేంద్రం తనిఖీ
అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేందాన్ని బుధవారం తనిఖీ చేసి,పిల్లల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.వారికి అందిస్తున్న పోషకాహారం పై అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో సరుకుల ఉన్నాయా అని ఆరా తీశారు. వాటి సరఫరా పై డీ డబ్ల్యుఓ లక్ష్మీరాజం ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పిల్లల ఆరోగ్యo వివరాలు, వారితో రోజూ చేయించే కార్యక్రమాల వివరాలను పరిశీలించారు. అనంతరం పిల్లలకు కూరగాయలు, పండ్ల చిత్రాలు చూపించి వాటి పేర్లు చెప్పమని అడిగారు.పలక పై ఏ,బీ,సీ,డీ లు రాసి పిల్లలకు చూపించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రoలో పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అలాగే ఇక్కడ అందిస్తున్న సేవల పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని సౌకర్యాలను పరిశీలించారు.పాఠశాల సమస్యలపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.