బలగం టివి, రాజన్న సిరిసిల్ల
మార్చి 3 వ తేదీన జిల్లా కేంద్రంలో 5కె రన్ నిర్వహణ
5కె రన్ లో మొదటి 13 మంది విజేతలకు సైకిల్ అందజేస్తాం, పాల్గొనే వారు వెంటనే ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకోండి
పెద్ద సంఖ్యలో ప్రజలు, యువతి, యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు పాల్గొని 5కె రన్ ను విజయవంతం చేయాలి.
5k రన్ లో పాల్గొనే వారు క్రింది ఇచ్చిన లింక్ లో https://forms.gle/d7RmMcdcsN94eHfu6 వివరాలు నమోదు చేసుకోగలరు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
యాంటీ డ్రగ్స్ అవగాహన 5k రన్ పోస్ట్ ను జిల్లా అధికారులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
యువత మంచి భవిష్యతుకై గంజాయి, మతుపదార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ” మార్చ్ 03 ” వ తేదీన జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మతుపదార్థాల అవగాహన 5కె రన్ లో జిల్లా ప్రజలు, యువతి,యువకులు, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు,పాత్రికేయ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని అన్నారు.5కె రన్ లో పాల్గొన మొదట 13 మందికి సైకిల్ బహమతిగా ఇవ్వడం జరుగుతున్నరు.5కె రన్ లో పాల్గొనే వారు తప్పకుండా https://forms.gle/d7RmMcdcsN94eHfu6 లింక్ లో తమ తమ పూర్తి వివరాలతో పెరు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో మాధకద్రవ్యాలు, గంజాయ నిర్ములనకు పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై గంజాయ రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలన్నారు .