- సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- జిల్లా షీ టీమ్.
బలగం టీవీ, బోయినపల్లి:
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతి రోజూ విద్యాసంస్థలు, మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్ / బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, షీ టీమ్ సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించి, వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని , నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని , ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని సూచించారు.సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని,గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవొద్దని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.



