- వట్టిమల్ల గ్రామంలో పల్లె దవాఖాన ప్రారంభోత్సవం
- పలు కులసంఘ భవనాలకు భూమి పూజ
- మూలవాగు,పేంటీ వాగులపై త్వరలోనే బ్రిడ్జిల నిర్మాణం

ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు..
బుధవారం కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో పల్లె దవాఖానాను జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి తో కలిసి ప్రారంభించారు..
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు వైద్యరంగానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు..పల్లె దవాఖానల ఏర్పాటుతో ప్రతీ పల్లెలో ప్రజల చెంతకే వైద్యం చేరుతోందని దీని వలన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందన్నారు..
నగరాలకు వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చుపెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని తెలిపారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేసి,మందులు పంపిణీ చేస్తారన్నారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు.
వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొట్ట మొదటి సారి వట్టిమల్ల గ్రామానికి వచ్చిన ఆది శ్రీనివాస్ కు గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు..

