బలగం టివి:
ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు
శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛాయుత వాతవరణం లో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీఅఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు అన్నారు.
ఈరోజు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్, శివనగర్,వెంకంపెట్ ,పెద్దూర్,అంబేద్కర్ నగర్,నెహ్రు నగర్, గోపాల్ నగర్, గాంధీ నగర్ లలో ఉన్న క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను డిఎస్పీ, సి.ఐ లతో కలసి పరిశీలించి, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయవలసిన భద్రత చర్యల మీద అధికారులకు పలు సూచనలు చేశారు.అదేవిధంగా క్రిటికల్ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు,నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని,ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి గొడవలు పోకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా ప్రలోభాల గురి చేసిన భయభ్రాంతులకు గురి చేసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఎస్పీ గారి వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.ఐ ఉపేందర్ ఉన్నారు.