- డీఎంహెచ్‌వో డా. రజిత
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లాలో గుర్తించిన ప్రమాదకర గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. రజిత ఆదేశించారు.
మంగళవారం జిల్లా కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో డా. రజిత సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డా. రజిత మాట్లాడుతూ ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను ముందుగానే గుర్తించి, సమయానుకూలంగా పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గర్భిణీపై వైద్యుల పర్యవేక్షణలో నియమిత చెకప్‌లు నిర్వహించి, అవసరమైన ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందజేయాలని ఆదేశించారు.అలాగే సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, ఆరోగ్య కేంద్రాల ద్వారా అమలు అవుతున్న పథకాల నిర్దేశిత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని వైద్యాధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మాతా శిశు సంరక్షణ కార్యక్రమ అధికారి డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సంపత్, డాక్టర్ రామకృష్ణతో పాటు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
