పంచాయితీల అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలి..

0
69

– పెద్దలింగాపూర్ సర్పంచ్ ను సత్కరించిన సీపీఎం నేతలు

  • సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు,
  • సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్

బలగం టీవీ, ఇల్లంతకుంట:

నిస్వార్థ ప్రజా సేవకు పట్టం కట్టి నిరంతరం ప్రజల కోసం పోరాడే ప్రశ్నించే గొంతుక ప్రజా ఉద్యమాల సారధి గన్నేరం వసంత నర్సయ్యను గెలిపించిన పెద్ద లింగాపూర్ గ్రామ ప్రజలకు జేజేలు తెలియజేస్తూ సర్పంచ్ గా గెలుపొందిన వారిని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి స్కైలాబ్ బాబు జిల్లా పార్టీ కార్యదర్శి మూషం రమేష్, కార్యదర్శివర్గ సభ్యురాలు జవ్వాజి విమల లు శాలువా కప్పి సత్కరించారు.

సోమవారం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ గా గెలుపొందిన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు రాజకీయాల కతీతంగా పక్షపాత ధోరణి లేకుండా ప్రతి గ్రామానికి ప్రజల ప్రాథమిక సౌకర్యాల కల్పనకు తోడ్పడాలని చెప్పారు గెలిచిన సర్పంచ్ లను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్న బిజెపి కాంగ్రెస్ నేతల వైఖరిని తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచులకు కేంద్రమంత్రి బండి సంజయ్ లక్షల రూపాయలు ఆఫర్ కేటాయిస్తూ తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని,ఇది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు. పెద్ద లింగాపూర్ గ్రామ ప్రజలు ప్రశ్నించే గొంతుకను ఎంపిక చేసుకున్నారని గ్రామంలో జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాటంలో రంగనాయక సాగర్ కాలువ పనులు పై జరిగిన పోరాటాల్లో గన్నేరం వసంత నర్సయ్య కృషిని ప్రజలు గుర్తించారని చెప్పారు.పెద్దలింగాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని చెప్పారు. గ్రామ ప్రజలు పాలక పార్టీలు డబ్బు మద్యాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని చెప్పారు.ముష్కన్ పేట లో ఏకగ్రీవంగా ఎన్నికైన సామనపల్లి రాములును పెద్దలింగాపూర్ లో వార్డు మెంబర్ గా గెలుపొందిన అనిల్ లకు శాలువా కప్పి సత్కరించారు..

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, సిపిఎం నాయకులు సామ నర్సింహారెడ్డి, రాములు, అనిల్, రచ్చ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here