రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక వ్యాధి నిరోధక కార్యక్రమం ప్రారంభం..

0
25

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. రజిత ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాధి నిరోధక కార్యక్రమము పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ 21.4.2025 నుండి 29.4.2025 వరకు వ్యాధి నిరోధక టీకాలు తీసుకొని పిల్లలకు( మిస్సింగ్ పిల్లలు) నిర్ణీత సమయంలో ప్రత్యేక వ్యాధినిరోధక టీకాలు వేయించేందుకు గ్రామాలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని, అన్ని ఆరోగ్య కేంద్ర పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీల్లో కోనారావుపేట ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలోగల నిజామాబాద్, ధర్మారం, నిమ్మపెళ్లి ఆరోగ్య ఉపకేంద్రములను ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల శిబిరాలను తనిఖీ చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము కోనారావుపేట ను సందర్శించి గర్భిణీ స్త్రీలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ తనిఖీలలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకొని పిల్లల(due) లిస్టును మరియు అన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా సూచిస్తూ ప్రతి ఆశ ఇంటింటి సర్వే ద్వారా గర్భిణీ స్త్రీలను నమోదు చేయడం, ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించడం, గర్భిణీ స్త్రీల చెకప్ ల రికార్డులను పరిశీలించి నిర్దేశిత సమయంలో చెకప్ లు చేయించాలని, గర్భిణీ స్త్రీల బాగోగులు ప్రతిరోజు సమీక్షించాలని సూచిస్తూ, సాధారణ పసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేటట్లు, మాతా శిశు మరణాలు లేకుండా కోనారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఉంచాలని జిల్లా వ్యాధి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఈ సందర్భంగా సిబ్బందికి దిశా నిర్దేశం చేసినారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎం హెచ్ ఎన్ డాక్టర్ అంజలి ఆల్ ఫ్రెండ్, డి ఐ ఓ సంపత్ కుమార్, ప్రాథమిక కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేణుమాధవ్, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here