బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. రజిత ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వ్యాధి నిరోధక కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం 21.4.2025 నుండి 29.4.2025 వరకు కొనసాగుతుంది. పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు.
టీకాలు వేయని పిల్లల (మిస్సింగ్ పిల్లలు) కోసం గ్రామాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని డాక్టర్. రజిత తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్. రజిత చీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లక్ష్మీపురం ఉప ఆరోగ్య కేంద్రం, నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లెల్ల ఆరోగ్య ఉపకేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాలు తీసుకున్న పిల్లల జాబితాను పరిశీలించారు. అలాగే, అన్ని రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంచుకోవాలని, వ్యాధి నిరోధక ప్రతికూల ప్రభావాల (AEFI) కిట్‌ను సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సంపత్ కుమార్ మరియు వై. నవీన విసీ సీఎం లు పాల్గొన్నారు.


