బలగం టీవి ….సిరిసిల్ల
జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
డిసెంబర్ 28 నుండి శనివారం వరకూ
జిల్లాలో మొత్తం 25 గ్రామపంచాయతీ లు, 67 మున్సిపల్ వార్డులలో ప్రజా పాలన గ్రామ, వార్డు సదస్సుల ను
నిర్వహించారు.
ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ మార్గదర్శనం మేరకు
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో ప్రజా పాలన కార్యక్రమం సజావుగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు పూజారి గౌతమి. ఎన్ ఖీ మ్యానాయక్ , జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, మున్సిపల్ కమిషనర్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరును పరిశీలిస్తూ కార్యక్రమం ప్రభావవంతంగా జరిగేలా , అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని క్షేత్ర అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఫలితంగా జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమం సక్సెస్ అయ్యింది. ఆరు గ్యారంటీ లకు సంబంధించి మొత్తం …….. దరఖాస్తులు వచ్చాయి.
రేషన్ కార్డుల మంజూరు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ……. దరఖాస్తులు వచ్చాయి.
( గమనిక : దరఖాస్తుల సంఖ్య ను కొద్ది నిమిషాల్లో పోస్ట్ చేస్తాము )
మిషన్ మోడ్ లో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తులు డేటా ఎంట్రీ
- ఎలాంటి తప్పులు లేకుండా క్వాలిటీ డేటా ఎంట్రీ జరగాలి : అదనపు కలెక్టర్ పూజారి గౌతమి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తేదీ 28/12/2024 రోజునుండి నేటి వరకు స్వీకరించిన ప్రజా పాలన 6 గ్యారంటీల దరఖాస్తుల డాటా ఎంట్రీ ప్రక్రియ జిల్లాలో మిషన్ మోడ్ లో జరుగుతుంది.
మండల కేంద్రము లలో తహశీల్దార్ , ఎంపిడివో కార్యాలయాలలో , మున్సిపాలిటీ కార్యాలయాలలో డేటా ఎంట్రీ ప్రక్రియ ఎంపిడివో, తహశీల్దార్ ల పర్యవేక్షణ లో జరుగుతుంది.
శనివారం ప్రారంభమైన డేటా ఎంట్రీ ఉదయం 06.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు, మధ్యాహ్నం 02.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు రెండు షిఫ్ట్ లలో జరుగుతుంది.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ఉద్దేశంతో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో క్రోడీకరించడానికి ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో అన్ని శాఖల నుండి దరఖాస్తుల ఆన్లైన్ నమోదు కొరకు ఆపరేటర్లను నియమించడం జరిగింది.
ఆపరేటర్లు వారికి కేటాయించిన దరఖాస్తు ఫారాలను ఎటువంటి తప్పులు లేకుండా ఆన్లైన్ చేయడం జరుగుతుంది.
శనివారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ప్రజా పాలన కార్యక్రమం దరఖాస్తుల డేటా ఎంట్రీ నీ సిరిసిల్ల మున్సిపాలిటీ, ఎల్లా రెడ్డి పేట లో పరిశీలించారు.
ఎలాంటి తప్పులు లేకుండా క్వాలిటీ డేటా ఎంట్రీ జరిగేలా మానిటర్ చేయాలని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఎంపిడివో, తహశీల్దార్ లకు సూచించారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.