బలగం టివి ,,సిరిసిల్ల
క్రీడలు సిబ్బంది మానసికోల్లాసానికి దోహదపడుతాయి.
మూడు రోజుల పాటు ఉత్సాహకంగా కొనసాగనున్న సిరిసిల్ల పోలీస్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని,సిబ్బందిలో స్నేహసబంధాలు మెరుగు పడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., అన్నారు.సిరిసిల్ల పట్టణంలోని స్థానిక కళాశాల మైదానంలో సిరిసిల్ల పోలీస్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులతో పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీస్ లకు క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నారు.జిల్లాలోని సర్కిల్ వారిగా, జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి మొత్తం 08 టీమ్ లుగా MT ఈగల్స్,వేములవాడ రుద్రాస్,DG బ్రేవ్ సోల్జర్స్, DAR వారియర్స్,అలైడ్ వింగ్స్, సిరిసిల్ల స్ట్రైకర్స్.,సిరిసిల్ల స్టోల్జర్స్,వేములవాడ రుద్రస్ గా ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు ఈ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ రోజు మ్యాచ్ లలో భాగంగా MT ఈగల్స్ vs అలైడ్ వింగ్స్ టీమ్స్ పాల్పడగా మొదటగా బ్యాటింగ్ చేసిన అలైడ్ వింగ్స్ టీమ్ నిర్ణిత 10 ఓవర్లలో 09 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేయగా MT ఈగల్స్ టీమ్ 9.1 ఓవర్లలో 69 పరుగులు చేసింది. 28 పరుగులు చేసి, బొలింగ్ లో 02 వికెట్లు తీసి గెలుపు లో కీలకంగా వ్యవహరించిన సురేందర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ లభించింది.
ఎస్పీ గారి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, సి.ఐ లు రఘుపతి, అనిల్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్,ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు,ఆర్.ఎస్. ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.