వేములవాడ నూతన డిఎస్పీగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ..

0
82

బలగం టీవీ, వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడ సబ్ డివిజన్ కార్యాలయంలో నూతన డిఎస్పీగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నూతన డిఎస్పీగా మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here