స్థానిక సంస్థల ఎన్నికలు..
తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
బలగం టీవీ, రుద్రంగి:
రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తన తన కుటుంబ సభ్యులతో కలిసి హక్కును వినియోగించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ బూత్‌కు తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన, సామాన్య ఓటర్ల మాదిరిగానే క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను చాటుతూ, బాధ్యతాయుతంగా ఆయన తన ఓటును వినియోగించుకోవడం జరిగింది.



