భీమేశ్వర స్వామి వారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్..

0
89

బలగం టీవీ, వేములవాడ :

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి స్వామివారి శేష వస్త్రం,లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

మొక్కు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభిమాని మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిస్తే, స్వామివారికి ఎమ్మెల్యే ఎత్తుకు సమానంగా తులాభారం బెల్లం పంచిపెడతామని మొక్కుకున్నారు.తమ మనసులో పెట్టుకున్న సంకల్పం నెరవేరడంతో, స్వామివారి సన్నిధిలో తులాభారం బెల్లం పంచిపెట్టి మొక్కును చెల్లించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here