బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లోగల అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామి వారి ఆరట్టు ఉత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకొన్నారు.





