బలగం టివి, , తంగళ్లపల్లి
కేజీబీవీ లో గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సౌజన్యంతో ప్రయోగాత్మకంగా అమలు అవుతున్న షేరో ప్రాజెక్ట్ అమలు ను కలెక్టర్ అనురాగ్ జయంతి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పరిశీలించారు.దీనిలో భాగంగా పిల్లలు సైన్స్ పాఠాలు,టెక్నాలజీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మొదలైన సబ్జెక్టులలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రత్యేక పరికరాల ద్వారా అందిస్తున్న శిక్షణ తీరును, వివిధ రకాల కృత్యాలను పరిశీలించారు. విద్యార్థులను ఆ కృత్యాలు ఏ విధంగా తయారు చేశారు.వాటి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను కార్యదర్శి అభినందించి వెన్ను తట్టారు.
మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థినిలు ఆధునిక ప్రపంచంతో పోటీపడేలాగా జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.ఈ ప్రాజెక్ట్ ప్రభావ వంతంగా అమలు చేస్తూ జీవన నైపుణ్యాలతో పాటు ప్రాక్టికల్ గా పాఠాలు నేర్పించడం ఆక్టివిటీ బేస్డ్ ద్వారా విద్యను అందించడం, ప్రయోగ నైపుణ్యాలు నేర్పించడం, స్వయంగా చేసి చూపించే నైపుణ్యాలను పెంపొందించడం,ఒత్తిడిని ఎలా ఎదుర్కోవడం,నాయకత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం వంటి కార్యక్రమాల వల్ల విద్యార్థినిల భవిష్యత్ కు బంగారు బాటలు వేసేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం,కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.