సిరిసిల్ల న్యూస్:
పదిర గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎల్లారెడ్డిపేట మండలం కదిరే గ్రామానికి చెందిన తెడ్డు పరశురాములు అనే వ్యక్తి ఇంట్లో లేకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించి 6 తులాల బంగారము 20 తులాల వెండిని దోచుకెళ్లారని బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సమాచారం అందుకున్న ఎస్ఐ రమాకాంత్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన దొంగతనాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా వేలిముద్ర నమూనాలు స్వీకరించి దొంగలను పట్టుకుంటామని తెలిపారు.
