గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ సెంటర్స్, చెక్ పోస్టులు ఆకస్మిక తనిఖీ.
ఎల్లారెడ్డిపేట,ముస్తాబాద్ మండలాలలో పలు నామినేషన్ సెంటర్స్ తోపాటుగా పెద్దమ్మ, వెంకట్రావుపల్లి చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్స్ తో పాటుగా పెద్దమ్మ, వెంకట్రావుపల్లి చెక్ పోస్ట్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి విధుల్లో ఉన్న సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలకు ,వార్డులకు మూడవ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని, నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లును చేయడం జరిగిందన్నారు.సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ కొనసాగిస్తు అక్రమ మద్యం, డబ్బు రవాణాలను అడ్డుకునేందుకు ప్రతీ వాహనాన్ని చెక్‌పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసు యంత్రంగం పకడ్బందీ చర్యలు చేపడుతుందని,దీనిలో భాగంగా పోలీస్ సిబ్బంది గ్రామాలను తరచూ సందర్శిస్తూ ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నమని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లగించిన వారిపై ఇప్పటికే ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్‌షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించగా, 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 158 కేసుల్లో 657 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ఎస్పీ వెంట సి.ఐ లు శ్రీనివాస్, మొగిలి,ఎస్.ఐ లు గణేష్, అనిల్ సిబ్బంది ఉన్నారు.







