నీతిమాలిన మాటలు బంజేసి నిజనిజాలు మాట్లాడు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

– బీఆర్ఎస్ నేత మాట్ల మధు

  • రూ.40 వేలు నేను తీసుకున్నట్లు నిరూపించు రాజకీయ సన్యాసం చేస్తా …
  • మీ నాయకుడు నాకు నలబై ఇచ్చిన సంగతి దమ్ముంటే నిరూపించు
  • నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకొని మండలం నుండి వెళ్ళిపోతా
  • నిరూపించపోతే నా ఊరికొచ్చి ముక్కు నేలకు రాసి నా గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • నువ్వంటేనే..బ్లాక్ మెయిల్, డబ్బులు వసూళ్లకు కేరాఫ్
  • మీ కేకే మహేందర్ రెడ్డి మీకు నేర్పుతున్న సంస్కృతి ఇదేనా
  • మల్లోసారి మా కేటీఆర్ ను విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
  • కేటీఆర్ కన్న బెటర్ డెవలప్ చేయండి..పెండింగ్ పనులను పూర్తిచేసి ప్రజల చేత శభాష్ అనిపిచ్చుకొర్రి
  • పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి..బెదిరింపు రాజకీయాలు చేస్తే ఊరుకోం
  • మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టీ కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నాయకులు

ఈ సందర్భంగా మాట్ల మధు మాట్లాడుతూ.. సిరిసిల్లలో జరిగే పరిణామాలకు కేకే మహేందర్ రెడ్డి కారణమని,తన అనుచరులతో తిట్ల పురాణనికి తెర లేపిండనని అన్నారు. విచక్షణా కోల్పోయి నా కుటుంబం గురించి మాట్లాడితే నేను మాట్లాడిన మాటలకు వేరే పార్టీ వాళ్ళు ప్రెస్ మిట్ పెడితే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే విధానం లేదని వ్యక్తిగతంగా దూషణలకు దిగే నీచపు సంస్కృతి నీదని,ఈ చిల్లరగాళ్ళతోని ఎందుకు మాటలు పడాలని అందరూ అనుకుంటున్నారు. అది నీ గొప్పతనం కాదు వాళ్ళ చేతగాని తనం కాదని ఇది ప్రజాసౌమ్య దేశం మాటకు మాట ఖచ్చితంగా మాట్లాడుతం ఊకే ఎందుకు పెడుతున్నావ్ ప్రెస్ మీట్ అని అన్నారు.

మీ నాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని గెలిచాన,నిరూపించాలని నిరూపించక పోతే మా ఉరికొచ్చి ముక్కు నేలకు రాసి నా గ్రామ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పుతా అని అన్నారు. ఫస్ట్ టైం నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు కొందరు నేతలు పైసలు ఇస్తానంటే తీసుకోలేదు. అది నా క్యారెక్టర్, అప్పటి ఇప్పటికీ కేటీఆర్ వెంబడే ఉంటామని చెప్పం. ఉంటాం ఆరోపణలు చేస్తే అతికినట్లు ఉండాలి. నీది నోరా సిరిసిల్ల మోరా, నువ్వు జేయవట్టి మీ మహేందర్ రెడ్డికి ఉన్న ఆ కొంత ఇజ్జత్ మొత్తం పోతుంది. ఎప్పుడు మరుతావు ఇంకా, అధికార పార్టీలో ఉన్నవ్ కొంచెం ఆలోచించి మాట్లాడు,టోనీ అంటేనే కేరాఫ్ అబద్ధాలు,బ్లాక్ మెయిలు రాజకీయాలు,డబ్బులు వసూలు చేసుడేనా, నీ అనుచరులకు నేర్పిక్చే సంస్కృతి ఇదేనా, నువ్వు జేయవట్టి మండలంలో నీ పార్టీ పని అయిపోయిందని అన్నారు. తంగాళ్లపల్లి మండలానికి ఓ చరిత్ర ఉంది. ఇక్కడ ఎంతో హేమాహేమీలు ఉన్నారు. పెద్దలు జువ్వాడి నర్సింగరావు,గొట్టే భూపతి లాంటి మహా మేధావులు ఉన్న తంగలపల్లి గ్రామానికి పేరు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నావు. అలాంటి మండలాన్ని నీ పిచ్చి చేష్టలతో ఖరాబ్ చేస్తున్నావని అన్నారు.

మండలంలో అప్పట్లో ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు నడిచేవి. నువ్వచ్చిన తర్వాత బ్రస్తుపట్టి పోయింది.నిన్ను చూస్తే మండల ప్రజలు బయపడుతున్నారు. వ్యక్తిగతంగా పోతున్నవని నువ్వు చదువుకోలేదు కాబట్టి ఎవ్వరు చెప్పిన వినవని, ప్రజసౌమ్య బద్దంగా మాట్లాడు నువ్వు బయపెడితే బయపడుతనా అని అన్నారు. మచ్చ లేకుండా పది సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశాను. వార్డు మెంబర్ గా గెలవని నీకేం తెలుస్తది.నా ఉరినీ అవమానిస్తావా నా ఊరు నాకు దేవాలయం నా ఊరు ఎలా డెవలప్ అయ్యిందో చూడు అధికార పార్టీ మీరే ఇలా మాట్లాడుతుంటే ప్రజలు చీ కొడుతున్నారు. పద్ధతిగా మాట్లాడు రాజకీయంగా మాట్లాడు నా కుటుంబం గురించి మాట్లాడినావు కాబట్టే నేను మాట్లాడినాను. నువ్వే ఉన్నావా మండలంలో, నీకన్న హేమాహేమీలు ఉన్నారు. నీకన్న ఎక్కవ మాట్లాడొచ్చు.కొంచెం బుద్ధి, జ్ఞానం పెంచుకొని మాట్లాడాలని అన్నారు. నా భార్య పేరు మీద ఉన్న భూమి గురించి చర్చకు రా, ఎక్కడ పెడుదామో టైం పెట్టు, అనవసర ఆరోపణలు చేస్తావు. చర్చకు రమ్మంటేరావు. నీ టీమ్ ను తీసుకొని వచ్చి పోటోలు దిగిపోవుడు, అసత్య ఆరోపణలు చేశుడు తప్ప ఏం జేసినావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడిసింది. ఇప్పుడు నడువది. మీ ప్రజా ప్రభుత్వంలో నడిసేది ఇదేనా, ఇచ్చిన హామీలు అమలు చేయక అనసవర ప్రెస్ మీట్లు పెట్టీ ప్రజలను ఆగం జేస్తున్నవు. కేటీఆర్ నీళ్లు తెస్తే మీ మహేందర్ రెడ్డి జీర్ణించుకోలేక మీ నాయకుడు మాట జారితే మేము కూడా మాట్లాడం, బరాబర్ సమాధానం చెప్పుతామని అన్నారు. కేటీఆర్ ఏం చేసిండో తెలుసుకో, మిగిలిన పెండింగ్ పనులుంటే మా కోసం చేయు. కానీ కేటీఆర్ ను విమర్శిస్తే ఊరుకోనని అన్నారు. నా గులాబి బలగమేంత మీ బలగమెంత ఒక్కసారి చూడండి. మీ అన్యాయాలను ఎదిరించడానికి మా సైనికులు కదిలి వస్తున్నారు. మహేందర్ రెడ్డి మా దళిత నాయకులను ఉసిగెలిపి నాపై ఆరోపణలు చెపిస్తవా అని అన్నారు.

కేటీఆర్ తో పనులు చేయించుకొని ఇప్పుడు ఆయన్ను విమర్శిస్తున్న నాయకులకు సిగుండాలి. రెచ్చగొట్టి మాటలు మాట్లాడి ఇప్పుడు కేటీఆర్ బాధ్యత వహించాలనీ అంటారా, సిరిసిల్లలో జరిగే అన్యాయాలకు కేకే మహేందర్ రెడ్డి బాధ్యత వహించాలి. డాక్టర్ల దగ్గర కమిషను లు తీసుకున్నానని అంటావా, దానిని నిరూపించాలని అన్నారు. నా గ్రామ ప్రజలకు సేవ చేసినా నన్ను గెలిపించిన ప్రజలకు అండగా ఉండడం బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రామంలో బండి జగన్, సిలివెరీ చిరంజీవి,కడారి నవీన్ రెడ్డి ,గుండు ప్రేమ్,అమర్ రావు,కొమరయ్య, కృష్ణ,ముత్యంరెడ్డి, శ్రీకాంత్రావు,నరేష్,జీవన్,తిరుపతి,లింగం,రమేష్,మహేష్, అఫ్రోజ్,అబుకర్ ,నర్సింహాలు,రవి, శేఖర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş