దాచారం పాఠశాల పెయింటింగ్ విరాళం అందజేసిన స్ట్రీట్ కాస్ ngo సంస్థ.

0
34

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలంలోని దాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పెయింటింగ్ కొరకు ఒక లక్ష పదిహేను వేలు స్ట్రీట్ కాస్ IARE ENGINEERING COLLEGE HYDERABAD NGO సంస్థ అందజేశారు.

ఈ సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాచారంలో ఇన్చార్జి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తూముకుంట నరేందర్ రెడ్డి అధ్యక్షతన పాఠశాల పెయింటింగ్ కొరకు స్ట్రీట్ కాస్ ఎన్జీవో సంస్థ ఐఏఆర్ఈ కళాశాల హైదరాబాద్ విద్యార్థిని విద్యార్థులు (1,15000) ఒక లక్ష పదిహేను వేలు అందివ్వడం జరిగింది. గతంలో వీరు విద్యార్థిని విద్యార్థులకు హౌస్ డ్రెస్సెస్ మరియు షూ లకు( 60000) అరవై వేలు ఇవ్వడం జరిగిందని అయన తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తూముకుంట నరేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కుడుముల రేణుక నాగరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి సేవాగుణం చేయడం చాలా గొప్ప విషయమని స్ట్రీట్ కాస్ ఐఏఆర్ఈ సంస్థ వారు అందించినటువంటి వస్తువులను సద్వినియోగం చేసుకొని విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో పాసై పాఠశాలకు గ్రామానికి పేరు తేవాలని అదేవిధంగా స్ట్రీట్ కాస్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిత విక్రం స్ట్రీట్ క్రాస్ అధ్యక్షులు ఆదిత్య, వైస్ ప్రెసిడెంట్ సాయినాథ్ రెడ్డి, చారితార్త, అఖిల్, నవ్య, లాస్య, నైనిత మరియు ఉపాధ్యాయులు శ్రీను, సురేష్, శ్రీనివాస్, ఆనంద్, సంజీవ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here