బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
మండల ఎస్సై పృథ్వీధర్ గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మర్లపేట గ్రామం వైపు 08/03/2025 రోజున పెట్రోలింగ్ డ్యూటీ లో వెళ్లగా మర్లపేట గ్రామ శివారులో అక్రమంగా ఒక జెసిబి మరియు మూడు ట్రాక్టర్లతో ఎనిమిది మంది విలాసార గ్రామానికి చెందినవారు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకొని ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులను మరియు ట్రాక్టర్లను మరియు జెసిబిని, అట్టి జెసిబి డ్రైవర్ ను పిఎస్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేశామని మండల ఎస్సై పృధ్విధర్ గౌడ్ తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.