బలగం టీవి …
గడిచిన 10 రోజుల్లో సిరిసిల్ల పట్టణ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ట్తనిఖీల్లో పట్టుబడిన 18 మందికి ఒక రోజు జైలు శిక్ష,3000 రూపాయల జరిమాన,05 గురికి రెండు రోజుల జైలు శిక్ష,3000 రూపాయల జరిమానా,19 మందికి 3000 రూపాయల జరిమాన విధించిన జ్యూడిషియల్ 1st క్లాస్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు పట్టణ సి.ఐ ఉపేందర్ తెలిపారు.
సిరిసిల్ల పట్టణ సి.ఐ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తులకు తాగి వాహనాలు నడిపడం వల్ల జరిగే అనర్దాల గురించి కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సి.ఐ ఉపేందర్ గారు మాట్లాడుతూ…ప్రతి రోజు పట్టణ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాడం జరిగుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి వారి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగుతుందని అన్నారు..
మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశలకు పోలీస్ వెరైఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతాయి అని అన్నారు.
ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.అనంతరం ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ రాజు,ట్రాఫిక్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు..