బలగం టివి, ,ఇల్లంతకుంట,
ఇల్లంతకుంట మండలంలో గల దాబాల్లో ఎవరైనా మద్యం అమ్మినా, మద్యం సేవించడానికి అవకాశం కల్పించినా వారి పైన చట్టరిత్య చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక టీములు గా ఏర్పడి వెంకట్రావుపల్లి, ఇల్లంతకుంట, పెద్ద లింగాపూర్ గ్రామాలలో మరియు మండలంలోని అన్ని దాబాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తో పాటు ఏఎస్ఐ మోతిరాo, హెడ్ కానిస్టేబుల్ లు లక్ష్మణ్, దేవేందర్ రెడ్డి కానిస్టేబుల్ లు మధు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.