- డిఎస్పీ నాగేంద్రచారి
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సర్పంచ్ ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి హెచ్చరించారు. అభ్యర్థులు, వారి అనుచరులు గ్రామాల్లో డబ్బు పంచడం, ఓటర్లను ఆకర్షించడం లేదా కుల సంఘాలకు డబ్బు ఇవ్వడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని ఆయన కోరారు.
