సక్రమంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు..సిరిసిల్ల కలెక్టర్​ అనురాగ్​ జయంతి

బలగం టివి:

*అత్యవసర సర్వీసుల వారి కోసం రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు

*ప్రతి ఓటరుకు తప్పనిసరిగా ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలి

*పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసి అవసరమైన శిక్షణ అందించాలి

*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు

*రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవసరమైన అనుమతులను నిబంధనల మేరకు సకాలంలో అందించాలి

*రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్


సిరిసిల్ల 21, నవంబర్ 2023

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సక్రమంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.

మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, పోలింగ్ రోజు అత్యవసర సేవలు కింద విధులు నిర్వహించే ఓటర్లు తమ ఓటు హక్కు ముందస్తుగా వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, దరఖాస్తు చేసుకున్న ఓటర్ల కోసం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల జాబితా వివరాలను అందజేయాలని అన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు సేకరణ వివరాలను ప్రతి రోజూ మీడియా ద్వారా తెలియజేయాలని అన్నారు.

పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 60 శాతం వెబ్ క్యాస్టింగ్ చేయాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

నూతన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ నివేదిక వివరాలను సమర్పించా లని అన్నారు. జిల్లాలో ప్రతి ఓటరుకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని, ప్రతి రోజూ ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పై నివేదిక అందించాలని, ప్రతి రోజూ నోడల్ అధికారి ద్వారా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పై రివ్యూ నిర్వహించాలని అన్నారు.

పోలింగ్ రోజు విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి చేసి, ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.

పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, వారికి అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవిఎం యంత్రాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎన్నికల ప్రచారం సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందు కు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, హోమ్ ఓటింగ్ గురించి వివరించారు.

ఈ విడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ ఆనంద్ కుమార్, dwo లక్ష్మి రాజం, ఎంసిసి నోడల్ అధికారిజితేంద్రప్రసాద్, కంట్రోల్ రూం బాధ్యులు రఫీ,AO రామి రెడ్డి, అదనపు drdo మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş