సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు చేపట్టాలి..

0
35

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

-ప్రతి మంగళ, శుక్రవారాలు డ్రై డే పాటించాలి

  • కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాబోయే వానాకాలం లో మన జిల్లాలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ (సీజనల్ వ్యాధులు) ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, సన్నిద్ధముగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాబోయే వర్షాకాలం సీజన్ సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పీపీటీ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో మీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని , అక్కడ నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

జ్వరాలు వచ్చాక ఇబ్బంది పడే కన్నా ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టి రాకుండా చూసుకోవడం ఉత్తమము అని అన్నారు. ఇండ్లలో ఉన్న నీటి నిల్వలను గుర్తించి మాపింగ్ చేయాలని, అనంతరం అక్కడ నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రతి మంగళ/ శుక్ర వారాలలో డ్రైడే కార్యక్రమంలో వాటర్ లాగిన్ పాయింట్ల మరమ్మత్తుకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు వినియోగించుకొని పనులు చేపట్టాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో , పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలచే అవసరమైన మేర ఆయిల్ బాల్ తయారుచేసి సన్నద్ధం కావాలని అన్నారు.జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ద వహించాలని అక్కడ అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అధికారులు గ్రామాలను సందర్శించాలని అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత , దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామ సభలలో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలని అన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని, వైద్య సేవలు మరియు అనుమానితులనుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలని అన్నారు.

జిల్లాలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ రాపిడ్ టెస్ట్ లు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే కార్యక్రమం కింద నిల్వ ఉన్న నీరు తొలగించాలని, ఇంటిలో నీరు నిల్వ ఉంచుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, జిల్లా పంచాయతీ అధికారి శరీఫుద్దీన్, ఎం.పీ.వో.లు, పంచాయతీ సెక్రటరీ లు సంబంధిత వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here