రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు..

0
51

రోడ్డు భద్రత కమిటీ సమావేశం..

  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆయా శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను ఇంచార్జి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్ లను మూసి వేయాలని, రోడ్డుపై అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను చెక్ చేసేందుకు స్పీడ్ గన్స్ కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో రోడ్డుకు సమీపంలో ఉన్న పాత బావుల పూడ్చివేత, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల వెంబడి ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో రేడియం సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్టీఏ నాన్ అఫీషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్, ఈఈ ఆర్ అండ్ బీ నరసింహాచారి, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, డిపిఓ షరీఫుద్దీన్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, పోలీసు ఎక్సైజ్ అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here