రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు..

0
307

‌‌- ఎరువుల సరఫరా పై కంపెనీ డీలర్లతో సమీక్షించిన జిల్లా కలెక్టర్..

  • కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మిని సమావేశ మందిరంలో ఎరువుల సరఫరా పై కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో అవసరమైన మేర స్టోరేజి అందుబాటులో ఉందని, రైతులకు అవసరమైన మేర ఎరువులను స్టోర్ చేయాలని అన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఖరీఫ్ సీజన్ లో ఎంత ఎరువుల అలాట్మెంట్ ఉంది, రైతులకు ఏ మేర విక్రయం చేశారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉంది వంటి వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ప్రతి డీలర్ నిబంధనల ప్రకారం ఆన్ లైన్ ఈపాస్ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువుల విక్రయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బల్క్ స్టాక్ పెట్టుకొని కృత్రిమ కోరత సృష్టించడం వంటి పనులకు ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎరువుల షాపులకు ఎంత స్టాక్ ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు, ప్రతి షాప్ వద్ద ప్రస్తుతం ఎంత స్టాక్ ఉంది వివరాలు అందించాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలి బేగం, వివిధ ఎరువుల కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here