బలగం టీవీ, బోయినిపల్లి:
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యా నికేతన్ స్కూల్ ఆవరణలో స్కూల్ టీచర్స్ మరియు తన సహచర విద్యార్థులతో కలిసి మొక్క నాటిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కన్నం సాగర్-వర్షితల కుమారుడు శ్రేయాస్.
ఈ సందర్భంగా కన్నం సాగర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని, మా అబ్బాయితో మొక్క నటించడం జరిగింది.భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ దాసరి జగన్, అలువాల అజయ్ మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మెంబర్ కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
