రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓయు విద్యార్థి ఉద్యమ నేత.. మంధాల భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో మంత్రి కేటీఆర్ భాస్కర్‌కు గూలాభి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.