బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
విద్యార్థులు,యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో పయనించాలనీ, చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చింతల మోహన్ అన్నారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శీతాకాల శిబిరం ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామంలో 5వ రోజులో భాగంగా హనుమాన్ దేవాలయంలో గడ్డి చెక్కి, శుభ్రం చేశారు.అదేవిధంగా హనుమాన్ దేవాలయంనుండి మజీద్ వరకు రోడ్డు ఊడ్చి శుభ్రం చేశారు.అనంతరం ఎన్.ఎస్.ఎస్ శిబిరం సందర్శించి వాలంటీర్లు నుద్దేశించి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చింతల మోహన్ ల మాట్లాడుతూ విద్యార్థి స్థాయినుండే సేవాభావం అలవరుచుకోవాలనీ, గ్రామంలో శ్రమదానం సేవలు అభినందనీయం అన్నారు. స్నేహభావం కలిగివుండాలనీ, ఐక్యతాభావం, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలనీ, యువతపైననే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు.గ్రామ సర్పంచ్ ముక్క శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు 5రోజులుగా శ్రమదానం చేస్తున్నారనీ, ఎన్.ఎస్.ఎస్ పెట్టడం సంతోషంగా ఉందని, శ్రమజీవనం, సేవాభావంతో అభివృద్ధి సాధ్యమని అన్నారు. జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాదమంది వాలంటీర్లు సేవలందిస్తున్నారనీ, గతంలో అనేక గ్రామాల్లో సేవలందించాలని, ఇంకా మారుమూల గ్రామాల్లోకి సేవలు విస్తరింపజేస్తామనీ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చింతల మోహన్, ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, గ్రామ కార్యదర్శి రవి, గ్రామ రక్షణాధికారి రవీందర్, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత,కొడిముంజ సాగర్, కారోబార్ రామకృష్ణ, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

