బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
కరాటే పోటీల్లో పెద్దూరు పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కరాటే లో మంచి ప్రతిభ కనబరిచి గోల్డ్ ,సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు బి.లిఖిత, ఎస్.లాస్య ప్రియ, ఎం.ప్రణీత, బి.వెన్నెల, సిహెచ్.హేమ, టీ.తన్విత, ఎస్.మేఘన, బి.దాక్షిణ్య లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తుల రమాదేవి, కరాటే మాస్టర్ సమ్మయ్య, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.