బలగం టివి , తంగళ్ళపల్లి
…మాజీ సర్పంచ్ మాట్ల మధు..
స్టడీ అవర్ కు హాజరవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందజేసిన మధు..
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో సాయంకాలం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు మాట్ల మధు అల్పాహారం అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తున్న మాట్ల మధు కు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానోపాధ్యాయురాలు అనురాధ.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్ల మధు,ఎంపిటిసి వెంకట్ రావు,ఫ్యాక్స్ చైర్మన్ లు కోడూరి భాస్కర్,మాజీ ఉప సర్పంచ్ సతీష్ రెడ్డి,
మాజీ విద్యా కమిటీ చైర్మన్ గణేష్,ఫ్యాక్స్ డైరెక్టర్ అబ్బాడి అనిల్ రెడ్డి,అబ్బాడి తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.