-ప్రిన్సిపాల్ పి.గంగయ్య
బలగం టీవి ,రుద్రంగి:
ఉత్తమ పలితాల కోసం ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయని ప్రిన్సిపాల్ పి.గంగయ్య అన్నారు..రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ ద్వితీయ విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని,అధ్యాపకులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఉత్తమ ఫలితాల కోసం కృషి చేస్తున్నారని అన్నారు..గత ఏడాది సాధించిన ఫలితాల కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..