బలగం టివి: ఎల్లారెడ్డిపేట:
యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో వాలంటీర్లు, అధ్యాపకులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గోడలకు ప్రమాదంగా మారిన కొమ్మలను తొలిగించారు. గడ్డిపొదలు, పిచ్చిమొక్కలు తొలిగించారు. చెత్త చెదారం తొలిగించారు.
ఈసందర్భంగా జాతీయసేవాపథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ విద్యార్థులు ఈ సమాజానికి సేవకులుగా మారాలన్నారు. పాఠ్యాంశాలతోపాటు సహపాఠ్యాంశాలు విద్యార్థులను సర్వతోముఖాభివృద్ది చేస్తాయన్నారు. జాతీయ సేవాపథకం ద్వారా విద్యార్థులకు సేవాభావంతోపాటు శ్రమవిలువ తెలుస్తుందనీ, ఉత్తమ పౌరులుగా ఎదుగతారనీ, కళాశాలలో జాతీయ సేవాపథకం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామనీ ఇంకా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి, బుట్ట కవిత, నీరటి విష్ణుప్రసాద్, కొడిముంజ సాగర్,ఆర్.గీత, చిలుక ప్రవళిక, అగోలం గౌతమి, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కె.దేవేందర్, ఎం.డి తాజోద్దిన్ మరియు లక్ష్మీ,ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు అరుణ్, రాకేశ్, సంజయ్, దేవరాజు,మనోహర్ 20మంది పాల్గొన్నారు.