–ప్రతి విద్యార్థి పుస్తకాలు చదివే అలవాటును మర్చిపోవద్దు..
–జిల్లా విద్యాధికారి ఏ. రమేష్ కుమార్
బలగంటివీ,సిరిసిల్ల:
సమాజం యొక్క అభివృద్ధి సైన్స్ మీద ఆధారపడి ఉంది అనీ, ప్రజల్లో నెలకొన్న అంధ విశ్వాసాలను నిర్మూలించాలంటే బాల్య దశ నుంచే విద్యార్థిలు సైన్సు పట్ల అవగాహన కలిగి ఉండాలనీ జిల్లా విద్యాధికారి ఏ. రమేష్ కుమార్ అన్నారు.శనివారం సిరిసిల్ల పట్టణంలోని సినారె జిల్లా గ్రంథాలయ సంస్థలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ… సమాజం యొక్క అభివృద్ధి సైన్స్ మీద ఆధారపడి ఉంది అని, నేడు సమాచారం తెలుసుకోవడానికి రకరకాల వనరులు అందుబాటులో ఉన్నాయాని ,అయినప్పటికీ ప్రతి విద్యార్థి పుస్తకాలు చదివే అలవాటును మర్చిపోవద్దు అని అన్నారు. చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి సైన్స్ పట్ల అభిరుచి పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదపడతాయాని అన్నారు. అనంతరం జిల్లా డిప్యూటీ సీఈవో వంగ గీత మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి బాల్య దశ నుంచి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే మూఢనమ్మకాలను నిర్మూలించే అవకాశం ఉంటుందని అన్నారు. నిత్యం సైన్సు విషయాలు తెలుసుకోవడంతో పాటు శాస్త్రీయ ఆచరణతో ముందుకెళ్లాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహను కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ఎంపిక కాబడిన జడ్పిహెచ్ఎస్ ఫాసుల్ నగర్, జడ్పిహెచ్ఎస్ బంధన్ కల్ , ప్రైవేట్ స్కూల్ విభాగం నుంచి విజ్ఞాన్ హై స్కూల్ ఎల్లారెడ్డిపేట విద్యార్ధులకు బహుమతిలను అందజేశారుఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సి.రామరాజు, జిల్లా అధ్యక్షులు గుర్రం అంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు ప్యారం లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎం. కిషన్, జిల్లా సైన్స్ ఆఫీసర్ పాముల దేవయ్య, జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల నిర్వాహకులు జీ. మధు, సి హెచ్.విజయ్, షీలా కుమార్, శ్రీరాములు, పి, అనిల్ కుమార్, గంగయ్య, దూస సంతోష్ మరియు జిల్లాలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
