బలగం టివి, ఎల్లారెడ్డిపేట
ఏల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం 1,2,3, క్లాస్ విద్యార్థులు శనివారం విహార యాత్రకు 400 మంది తో కలిసి తరలివెళ్ళినట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ లతీఫ్,ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సంతోష్ లు తెలిపారు.విహారయాత్రలో భాగంగా ప్రైమరీ విద్యార్థులను కరీంనగర్ డీర్ పార్కు కు తీసుకువెళ్ళడం జరిగిందని దీని విద్యార్థులకు వినోదం విజ్ఞానం పెరుగుతుందని వారు తెలిపారు.
400 మంది విద్యార్థులు శనివారం డీర్ పార్క్ లో 17 మంది ఉపాధ్యాయులు 10 మంది బోధనేతర సిబ్బంది మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు పుల్ ఎంజాయ్ చేశారని ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ సంతోష్ తెలిపారు.