ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి..

0
73
  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్  

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవి, ఉన్నత శిఖరాలకు ఎదిగి, మిగతా  విద్యార్థులకు స్పూర్తిగా నిలవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్  అన్నారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను మంగళవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో  విద్యార్థుల తో మాట్లాడారు.అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు.

ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి  అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని,ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని, ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.

మధ్యాహ్న భోజనం తయారీ పరిశీలన

విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తయారీని ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం సిద్దం చేసిన ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు.  కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర పదార్థాల నాణ్యతా, గడువు తేదీని పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూం నిర్వహణపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ రామ్ సూరత్ యాదవ్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, పీఆర్, హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

కోనరావుపేట మండలం మర్రిమడ్ల మరియు నిమ్మపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు.మండలానికి 577 ఇళ్ల నిర్మాణం మంజూరు చేయబడగా, వీటిలో 460 ఇళ్లకు ముగ్గు వేయబడినట్లు, బేస్మెంట్ స్థాయిలో 401, గోడల వరకు 325, స్లాబ్ స్థాయిలో 287 ఇళ్లకు పనులు పూర్తయినట్లు హౌసింగ్ అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని  అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here