పూర్వ విద్యార్థిని బక్కగారి నరేష్మా ఆర్థిక సహకారంతో దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దమ్మన్నపేట యందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పూర్వ విద్యార్థిని బక్కగారి నరేష్మా అందించారు. దమ్మన్నపేట వాస్తవ్యురాలు, ప్రస్తుతం పెద్దపల్లిలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న నరేష్మా తన ఆర్థిక సహకారంతో ఈ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేయడం విశేషం.
ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ.. పదవ తరగతిలో మార్కులు స్కోరు చేయడానికి స్టడీ మెటీరియల్ ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేశారు. ఇందుకు సహకరించిన నరేష్మాకు పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం, నరేష్మా మాట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవడానికి అవకాశం కల్పించినందుకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్, మారేపల్లి రాజు, గుడికాడి కొమరయ్య, శనిగరం నారాయణ, అజ్మీర కవిత, జరల విజయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

