బలగం టీవీ, ఇల్లంతకుంట:
వల్లంపట్ల జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ సాక్షి స్టడీ మెటీరియల్ గ్రామ సర్పంచ్ నేరెళ్ల విజయ్ గౌడ్ గారితో అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదువుకొని మండలంలో అత్యధిక మార్కులు పొందాలని సూచించారు. అదేవిధంగా ఎస్ఎస్సి విద్యార్థులు పరీక్షలు రాయడానికి గాలి పెళ్లి సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుందని వారి కోసం గాను వల్లంపట్ల గ్రామం నుండి బాలికలకు బాలురకు విడివిడిగా మూడు వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూస గోవర్ధన్, భీముని మల్లారెడ్డి హై స్కూల్ హెచ్ఎం నర్సింగరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
