- మురికి కాలువ అవినీతిపై చర్యలు తీసుకోవాలి
బలగం టీవి , ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన మురికి కాలువ నిర్మాణం కూలిన విషయం అందరికీ తెలిసిందే.దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని శనివారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారికి పోతుగల్ గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా దర్మేందర్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలోని రెండు పడకల ఇండ్ల నుండి మురికి కాలువ నిర్మాణం ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేయడం వల్ల కూలిపోవడం జరిగిందని,ఏఈ కాని మండల స్థాయి అధికారులు నిర్మాణ పనులపై పర్యవేక్షణ చేపట్టకపోవడంతో ఇష్టం వచ్చినట్టు నాణ్యత లేకుండా నిర్మించడంతో కూలిపోవడం జరిగిందని పేర్కొన్నారు ఈ విషయంలో ఎలాంటి నాణ్యతను పాటించని గ్రామపంచాయతీ పాలకవర్గంపై కాంట్రాక్టర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యుడు జంగ రాజు తదితరులు పాల్గొన్నారు.
