1 ట్రిలియన్ లక్ష్యానికి సమ్మిట్ కీలకం: సోనియా గాంధీ

0
64

బలగం టీవీ, హైదరాబాద్‍:

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురోగతికి దోహదపడటానికి చేస్తున్న అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపారు. సదస్సు విజయవంతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక, ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలసిన వారికి ఈ సదస్సు ఒక వేదికగా దోహదపడుతుందని సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పంపిన సందేశంలో పేర్కొన్నారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ–వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సదస్సు మరింత తోడ్పడుతుందని అన్నారు. సదస్సులో పాల్గొంటున్న వారందరికీ సోనియా గాంధీ శుభాభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here