గడువులోగా సీఎంఆర్ సరఫరా పూర్తి చేయాలి

0
97

బలగం టీవి,తంగళ్లపల్లి

  • అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా

కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా ఈనెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ రైస్ మిల్లర్లను ఆదేశించారు.బుధవారం తంగళ్ళపల్లి మండలం లోని తంగళ్ళపల్లి,రామన్నపల్లి, బస్వాపూర్ లోని రైస్ మిల్లులను పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ కి రైస్ మిల్లర్ లు సరఫరా చేయాల్సిన బియ్యం ఈ నెల 31 వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోజువారీగా లక్ష్యం నిర్దేశించుకుని బియ్యం సరఫరా ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.తనిఖీలో జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి,మేనేజర్ జితేంద్ర ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here