బలగం టివి, ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలం లో గంజాయి కేసుల్లో నిందితులు అయిన 1.మంతెన శ్రీకాంత్ అలియాస్ చింటు నివాసం. రహీంఖాన్ పేట, 2.కురెళ్ళ వంశీ నివాసం: పెద్దలింగాపూర్, 3.దొమ్మాటి అరవింద్ నివాసం ఇల్లంతకుంట, 4.దొమ్మాటి నవీన్, నివాసం ఇల్లంతకుంట లపైన మరియు దొంగతనం కేసులో నిందితులు అయిన తిప్పాపూర్ గ్రామానికి చెందిన కోడిముంజ రాజమౌళి మరియు కోడిముంజ తిరుపతి లపై మరియు దాచారం గ్రామం లో మర్డర్ కేసులో నిండుతుడు అయిన దరిపెళ్ళి వంశీ లపైన సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. మండలంలో ఎవరివైన ఇకపైన నేరాలు చేసినట్టు అయితే వారిపైన కూడా షీట్స్ ఓపెన్ చేయబడుతుంది, కావున యెవరు కూడా చట్ట వ్యతిరేక పనులు చేయకూడదు అని, సత్ప్రవర్తనతో ఉండాలని డి.సుధాకర్, ఎస్.ఐ ఇల్లంతకుంట గారు తెలిపారు.