బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి గ్రామానికి చెందిన సుందరగిరి రాకేష్ (24) అను అతడు డిగ్రీ వరకు చదువుకొని కరీంనగర్ లో ప్రైవేట్ గా ఉద్యోగం చేస్తున్నాడని తేదీ 17-04-2025 నాడు బోయినిపల్లిలో పండగ ఉందని వచ్చినాడని వరుసటి రోజు తేదీ 18-04-2025 రోజున ఉదయం 11:30 గంటలకు బయటికి వెళ్లి వస్తానని తన వాహనంపై వెళ్లినాడని, అప్పటినుండి ఇంటికి తిరిగి రాలేదని, ఫోన్ స్విచాఫ్ వచ్చిందని మృతుడి తండ్రి తెలిపినాడు. తేదీ 22-04-2025 రోజున మర్లపేట గ్రామ శివారులో ఏదో ఒక మగ వ్యక్తి శవం ఉందని తెలవగా మృతిని తండ్రి మల్లేశం అక్కడికి వెళ్లి చూడగా తన కొడుకు మృతదేహం అని గుర్తుపట్టి, తన కొడుకు గత కొన్ని రోజులుగా ఏదో బాధలో ఉన్నాడని, ఎందుకలా ఉన్నావని అడగగా తన యొక్క ప్రైవేట్ ఫోటోలు తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయని, అవి బయట పెడితే పరువు పోతుందని అని చెప్పినాడని, తన ఫోటోలు తన ఫ్రెండ్స్ బయట పెడతారని అనుమానంతో గాని మరి ఇతర కారణం వలన గాని మృతుడు చంద్రగిరి రాకేష్ చనిపోయి ఉంటాడని తన కొడుకు మరణంపై తనకు అనుమానం ఉన్నదని మృతుని తండ్రి సందరగిరి మల్లేశం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండల ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.